ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా కోట్లాది మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండగ క్రిస్మస్. ప్రపంచవ్యప్తంగా క్రిస్మస్ పండగను క్రైస్తవులు మత పరంగానూ , క్రైస్తవేతరులు సంస్కృతికంగానూ జరుపుకుంటారు. క్రిస్మస్ పండగ వేడుకలలో క్రిస్మస్ ట్రీ , లైటింగ్ , బహుమతులు , కొవ్వొత్తులు , అలంకరణలు , ప్రార్ధనలు వంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు శ్రీకారం చుట్టారు. పండగ మూడ్ లో ఉన్న సమంత హైదరాబాద్ లో తన ఇంటిని డెకరేట్ చేస్తున్నారు. సమంత తన ఇంటి వద్ద క్రిస్మస్ ట్రీ ని , గ్రీన్ , రెడ్ కార్డ్ బోర్డు ను రెడీ చేస్తున్నారు. క్రిస్మస్ రోజున స్నేహితులతో ప్రార్ధనలు చేయనున్నారు. లాక్ డౌన్ సమయంలో సమంత గార్డెనింగ్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. క్రిస్మస్ పండగ కై తన ఇంటిని డెకరేట్ చేస్తున్న సమంత ఆ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: