నిహారిక ‘పెళ్లి సందడి మొదలు’

Actress Niharika Konidela, Chaitanya Jonnalagadda, Destination Wedding, Heroine Niharika Konidela, latest telugu movies news, Latest Tollywood News, Mega Cousins, Niharika Konidela And Chaitanya Jonnalagadda Kick-Start Pre-Wedding Celebrations, Niharika Konidela And Chaitanya Will Tie The Knot In Udaipur, Niharika Konidela Pre-Wedding Celebrations, Niharika Konidela Pre-Wedding Celebrations With Mega Cousins, Niharika Konidela Pre-Wedding Celebrations With Mega Cousins At Udaipur, Niharika Konidela To Tie The Knot With Chaitanya Jonnalagadda, Nishchay, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Udaivilas Palace

మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైత‌న్య‌కు ఆగ‌స్ట్ 13న నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా నిహారిక పెళ్లి సందడి మొదలైనట్టు తెలుస్తుంది. దీనికి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేసిన ఫొటోలే నిదర్శనం అనిచెప్పొచు. చైనిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసాం అనిపోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ఫొటోలో మెగా కాంపౌండ్ వారసులంతా ఒక్కచోట చేరి నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పార్టీలో వరుణ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

ఇక నిశితార్థం రోజున ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఇప్పుడు పెళ్లికి కూడా ఇరుకుంటుంబ సభ్యులు వారికి అత్యంత స‌న్నిహితులు, ఇండ‌స్ట్రీకి చెందిన కొద్దిమంది ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో వివాహ వేడుకకు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసిన‌ట్టు టాక్‌. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ మొత్తానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.