టి – సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందనున్న మైథలాజికల్ మూవీ “ఆది పురుష్ “మూవీ ఆగస్ట్ 11, 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , సీత గా కృతి సనన్ , లంకాధిపతి గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న “ఆది పురుష్ “మూవీ కన్నడ , తమిళ , మలయాళ భాషలతో పాటు పలు ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆది పురుష్ “మూవీ ని దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలనీ , భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో ఇప్పటి వరకూ తెరకెక్కని మూవీ గా , ప్రేక్షకులను అలరించేలా రూపొందించాలనుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఉండడంతో “అవతార్” మూవీ కి పని చేస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్స్ “ఆది పురుష్ “మూవీ కి వర్క్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న “ఆది పురుష్ “మూవీ బాలీవుడ్ మూవీ గా కాకుండా హాలీవుడ్ మూవీ గా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ మూవీ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు పొందడం ఖాయం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























