24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్ళు “మూవీ రూపొందింది. భారీ బడ్జెట్ , అత్యుత్తమ టెక్ని కల్ వాల్యూస్ తో తెరకెక్కిన “మోసగాళ్ళు “మూవీ లో సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర ,రూహిసింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మోసగాళ్ళు ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నవీన్ చంద్ర బర్త్ డే సందర్భం గా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నవీన్ చంద్ర సీరియస్ లుక్ లో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మోసగాళ్ళు ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. “మోసగాళ్ళు ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో విష్ణు మంచుకు సోదరిగా కాజల్ నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























