పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిలికి చిలికి వాన అయినట్టు ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఇంకాస్త ముదిరింది. అయితే ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ సెట్స్ లో అలాంటివి పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు. నటులుగా మేము కలిసి పని చేసాం.. అంతేకాదు ఒకరి మీద ఒకరి గౌరవం ఉంది అని తెలిపాడు. అయినా పవన్ కు నేను తన ఐడియాలజీని విమర్శించానని.. పర్సనల్ గా తనని విమర్శించలేదని తెలుసు అని అన్నారు. రాజకీయంగా అభ్యంతరాలు ఉండవచ్చు అవి పర్సనల్ లైఫ్ కు తీసుకురాకూడని స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది. ఇక ఇప్పుడు పవన్ కూడా షూట్ లో పాల్గొంటున్నారు.
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: