సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేదలకి ఆయన అండగా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్ జరిగిందని నమ్రత తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చిన్నారికి అండగా నిలిచాడు మహేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారికి మహేష్ బాబు అండగా నిలిచారు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతుంది. చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించారు. ప్రస్తుతం ఆ పాప కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: