బిగ్ బాస్ 4 – ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిజంగా చెప్పాలంటే బోర్ టాస్క్ అని చెప్పొచ్చు. దెయ్యం టాస్క్ అయినా కానీ అంత మజా లేకపోవడంతో చూసే ప్రేక్షకుడికి చాలా బోర్ కొడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదిలా నిన్నటి ఎపిసోడ్ లో కూడా పెద్దగా మ్యాటర్ ఏం లేదని చెప్పొచ్చు. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎపిసోడ్ స్టార్టింగే అభి డేట్ కు వెళ్లనని చెప్పడంతో ఫీల్ అయిన మోనాల్ హారికతో ఆ విషయంపై చర్చిస్తుంటుంది. అతను ప్రతిసారి ఫ్రెండ్ కాదని ముఖం మీదే చెప్పేస్తాడని, ఈ రోజు కూడా అలానే అన్నాడని హారికతో చెప్పింది. జోక్ చేస్తే చాలు నువ్వు నా ఫ్రెండ్ కాదు.. జోకులు వేయకు అంటాడు. బిగ్‌బాస్‌లో ఉన్నంత వరకు కలిసి ఉండాలి. బయటకు వెళ్లాక ఆయన ఇష్టం. కలిస్తే కలవని లేదంటే లేదు. కానీ ప్రతిసారి ఫ్రెండ్ కాదని స్టేట్మెంట్ ఇవ్వడం నాకు బాధ కలిగింది’ అని చెపుతుంది.
ఇక ఆ తర్వాత టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న జలజ దెయ్యం ఇంట్లో ఉన్న ప్లేట్స్ మొత్తం దాచేసింది. అరటిఆకులు మాత్రమే ఇచ్చింది. అంతేకాదు ఇంట్లో ఏ క్షణమైనా లైట్స్ ఆఫ్ చేస్తానని.. ఆ టైమ్‌లో ఇంటి సభ్యులంతా చప్పట్లు కొడుతూ నవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యుల్లో ఒకర్ని ఎంచుకుని ఆ వ్యక్తి లాంతరు పట్టుకుని గార్డెన్ ఏరియాలో రాత్రి అంతా ఒంటరిగా నవ్వుతూ కూర్చోవాలని టాస్క్ ఇచ్చింది. ఇక ఇంటి సభ్యులంతా అవినాష్‌ని పంపారు.
మరోవైపు అఖిల్, మోనాల్ మాట్లాడుకుంటారు. గేమ్ గేమ్‌లా ఆడుదామని మోనాల్ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావ్ అని అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. ఇక అఖిల్ దగ్గర ప్రామిస్ తీసుకొని సోహైల్ గురించి చెప్పుకొచ్చింది. తాను చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని, ఎవరితో ఎలా మాట్లాడితే మంచి పేరు వస్తుందో అలా మాట్లాడుతాడని చెప్పింది. దానికి అఖిల్ ఒకరకంగా కౌంటర్ ఇచ్చినట్టే మాట్లాడతాడు. వాడు గేమ్ ఎలాగైనా ఆడని, నాతో మంచిగా ఉంటున్నాడు. వాడితో నాకు మంచి రిలేషన్ ఉంది. నాతో ఎలా ఉంటున్నాడో అన్నదే నాకు మెయిన్ అని చెప్పాడు. ఈ టాస్క్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. అరియానా, అవినాష్, సోహెల్ లను దెయ్యం ఆవహించింది. ఈ ముగ్గురు దెయ్యంలా బిహేవ్ చేయాలి. మిగిలిన వారు ఇంట్లో ఉన్న మూడు బొమ్మలను వెతికి స్విమింగ్ పూల్‌లో వేయాలి. ఒక్కో బొమ్మ వేసినప్పుడల్లా.. ఒకరిని మనిషిగా మార్చొచ్చు అని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అఖిల్ అన్ని బొమ్మల్ని స్విమ్మింగ్‌పూల్‌లో వేసి మనుషుల టీమ్‌ను గెలిపించాడు.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులకు జలజ దెయ్యం రామ్ గోపాల్ వర్మ ‘12వ అంతస్తు’ సినిమా చూపిస్తూ.. మధ్య మధ్యలో సినిమా ఆపి.. ఒక్కో ఇంటి సభ్యుడ్ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి.. అక్కడ ఉన్న స్పూన్ని వెతికి తేవాలని టాస్క్ ఇచ్చింది. మొదటగా కన్ఫెషన్ రూమ్‌కి అరియానా, అవినాష్‌లను పంపింది. రెండోసారి మోనాల్.. అనంతరం సొహైల్, అఖిల్‌లను కన్ఫెషన్ రూమ్‌కి రావాలని జలజ ఆదేశించింది. అందరూ భయపడుతూనే స్పూన్స్ ను వెతికి తీసుకొచ్చి పెట్టారు.
రెండు రోజులు చప్పగా సాగిన ఈ ఎపిసోడ్ ఈరోజుతో ముగియనుంది. మరి ఈ రోజు కెప్టెన్సీ పోటీకి ఎవరు సెలెక్ట్ అవుతారో.. ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























