సీటీమార్ సెట్లో – ఫుల్ స్వింగ్ లో షూట్

Director Sampath Nandi Shares A Selfie From The Sets Of Seeti Maar On Social Media

హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో చేస్తున్న‌ ఏర్పాట్ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేశారు. అవ‌స‌ర‌మైన అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రిపి చిత్రీక‌ర‌ణ పూర్తిచేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు డైరెక్టర్ సంపత్ నంది తాజాగా మరో ఫొటోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు. సీటీమార్ సెట్లో ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ షూట్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.

కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నకాగా ఈ సినిమాలో తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తుంది. తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.