శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ – మెహరీన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్” F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించిన ” F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ “మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ” F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ “మూవీ సీక్వెల్ “F 3” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




దర్శకుడు అనిల్ రావిపూడి తన బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా మీడియా తో సమావేశమయ్యారు. “F 3” మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్ ను దర్శకుడు అనౌన్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ సంగతి ఎలా ఉన్నా “F 3” మూవీతో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్ అందుతుందనే గ్యారెంటీ ఇవ్వగలననీ, “F 2” మూవీ కంటే మరింత కామెడీ తో “F 3” మూవీ తెరకెక్కనుందనీ, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందనీ, నిర్మాత దిల్ రాజు
డిసెంబర్ 14 తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లాన్ చేశారనీ , సేమ్ టీమ్ తోనే “F 3” మూవీ తెరకెక్కనుందనీ , సినిమా తనకు స్వర్గం వంటిదనీ , అదే తనకు కావాల్సినంత ఎనర్జీ ఇస్తుందనీ , ఎప్పుడూ షూటింగ్ లతో సందడిగా ఉండాలని కోరుకుంటున్నాననీ అనిల్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























