దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అమెజాన్ లో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ లో వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని.. చాలా నేచురల్ గా తెరకెక్కించారన్న ప్రశంసలు అందుకుంటున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్న విజయ్ దేవరకొండతో మల్టీ స్టారర్ పై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తో మల్టీ స్టార్ ఏదైనా చేసే ఆలోచనలో ఉన్నారా అని ఆనంద్ ను అడుగగా.. సినిమా అయితే ఇప్పుడైతే అలాంటి పప్లాన్స్ ఏం లేవని నో అనే సమాధానం చెప్పాడు. అంతేకాదు సూర్య, కార్తీలు ఇప్పటికే స్టార్ హీరోలు అయినా కూడా ఇప్పటి వరకూ కలిసి సినిమా చేయలేదు. నేను ఒక పది సినిమాలు చేసాక అన్నయ్యతో కలిసి నటించే విషయం గురించి ఆలోచిస్తా అని క్లారిటీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.
కాగా విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: