‘సూర్య’ సినిమాపై ‘మహేష్’ ప్రశంసలు

Super Star Mahesh Babu Applauds Aakasam Nee Haddura Movie Team On Movie Success

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాపై స్పందించి పొగడ్తలు కురిపించారు. నిన్నటికి నిన్న విజయదేవరకొండ ఈ సినిమా చూసి చాలా బావుందని చెప్పడంతో పాటు డైరెక్టర్ సుధా తో సినిమా చేయాలని వుందని కూడా తెలిపాడు. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా సూర్య, చిత్రయూనిట్ ను ప్రశంసించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

.తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఆకాశం నీ హ‌ద్దురా సినిమా గురించి తన ట్విట్టర్ లో.. “సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రం. బ్రిలియంట్ డైరెక్షన్.. అందరి ప‌ర్‌ఫార్మెన్స్ అద్భుతం. సూర్య న‌ట‌న చాలా బాగుంది.. సూర్య టాప్‌ రేంజ్‌లో నటించాడు. టీం సభ్యులు అంద‌రికి నా అభినంద‌న‌లు అని తెలిపారు. ఇక మహేష్ ట్వీట్ కు సూర్య కూడా రిప్లై ఇచ్చాడు. మ‌హేష్‌కు ధ‌న్య‌వాదాలు తెలియచేస్తూ.. సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు.

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను అమెరికాలోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.