నాగశౌర్య ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేపనిలో పడ్డాడు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. అక్టోబర్ లో షూటింగ్ రీస్టార్ట్ చేసిన చిత్రయూనిట్ ఇపుడు ఫస్ట్ గ్లింఫ్స్ వీడియోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. నవంబర్ 13న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ట్విటర్ ద్వారా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The fun ride of Marriage has just began😄
Excited to share the glimpse of my next with all of you on 13th November at 6:03 pm 😉@riturv @Composer_Vishal @LakshmiSowG @vamsi84 @SitharaEnts pic.twitter.com/idEcpkRKBX— Naga Shaurya (@IamNagashaurya) November 10, 2020
ఇక ఈ సినిమాలో నాగశౌర్య కు జోడీగా రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. వెడ్డింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయనున్నారు.
వీటితో పాటు డైరెక్టర్ అనీష్ కృష్ణతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఇటీవలే ప్రారంభించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























