డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం లాంటి సినిమాలే ఉదాహరణ. తొలి చిత్రం ‘గమ్యం’ నుంచి గత చిత్రం ‘యన్టీఆర్ మహానాయకుడు` వరకు ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ రూపొందించిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. ఇక ఈరోజు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా క్రిష్ జాగర్లమూడి అసలు పేరు రాధా కృష్ణ అన్న సంగతి తెలిసిందే. మరి రాధా కృష్ణ పేరు క్రిష్ గా ఎలా మారిందో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిష్ చెప్పాడు. డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం కాకముందు తను అమెరికాలో జాబ్ చేసిన సంగతి విదితమే. ఇక తను చేసిన కంపెనీలో సహా ఉద్యోగులు పేరు సరిగా పలకడం రాక రాడీ, కృష్ణ, జాగర్, ముండి అని పిలిచేవారట. అప్పుడు తన పై అధికారి ఇలా కాదని చెప్పి తనకు క్రిష్ అని పేరు పెట్టి ఇలా పిలుస్తున్నా అని మెయిల్ చేసింది అలా క్రిష్ అయింది. ఇండియా వచ్చిన తర్వాత ఒక కంపెనీ పెట్టాం.. దానికి అమెరికా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళం. వాళ్లకి కూడా ఈజీ గా ఉంటుందని అదే కంటిన్యూ చేసాం. ఇక సినిమాల్లోకి వచ్చేసరికి.. అప్పటికే చాలామంది రాధా కృష్ణ గార్లు వున్నారు. సో ఇంకా సినీ పరిశ్రమలో కూడా అదే ఉంచేశాం అని చెప్పుకొచ్చాడు.
కాగా ప్రస్తుతం క్రిష్ రకుల్, వైష్ణవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. ఇక క్రిష్ పవన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా టైం పడుతుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























