బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తన తర్వాత సినిమాలు కూడా అదే రేంజ్ లో తీస్తున్నాడు. ప్రస్తుతం ఒక మూడు నాలుగు భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు అని చెప్పగానే డిజైనర్లు తమ బుర్రకి పని చెప్పి ప్రభాస్ రాముడిలా ఉండే గ్రాఫిక్ ఫొటోలను చాలానే చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ అభిమాని.. రాముడిగా ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో ఓ లుక్‌ను తయారు చేసి పోస్ట్ చేశాడు. ఈ లుక్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇక ఈ లుక్ పై డైరెక్టర్ కూడా స్పందిస్తూ “ఈ లుక్ చూసి స్టన్ అయ్యాను.. మీకు చాలా శక్తి ఉంది” అంటూ ట్వీట్ చేసాడు. మరి ఫైనల్ గా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేంత వరకూ ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో..
This is stunning. More power to you @PrabhasCentral.#Adipurush #Prabhas https://t.co/8Gqzy5cQBO
— Om Raut (@omraut) November 9, 2020
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాను 2022లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























