అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో మనాలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడే నాగ్ దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. “వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది”అని ట్వీట్‌తో పాటు కొన్ని ఫొటోలను నాగార్జున షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Heading home after wrapping up my work for #WildDog !!feeling sad as I say good bye to my talented team and the Himalayas!! #manali @MatineeEnt @SaiyamiKher @ActorAliReza @onelifeitiz @mayankparakh19 @bilal06858696 pic.twitter.com/Ur3V5OH9if
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 6, 2020
ఇక ఇన్ని రోజులు ఓ వైపు బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ చేస్తూ, మరో వైపు వైల్డ్ డాగ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు ఒక బాధ తప్పినట్లయింది నాగ్ కు.
కాగా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న సయామీ ఖేర్, అలీ రెజా, మయాంక్ ప్రకాశ్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: