మీకు నచ్చిన కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఏది?

Which Is Your Favorite Among The Lady Oriented Movies Of Actress Keerthy Suresh

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాతోనే అనేక అవార్డులు గెలుచుకుంది.. జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం కీర్తి సురేష్ నటన గురించి మాట్లాడుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా వరకు కీర్తి సురేష్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా వాటిలో చాలా వరకూ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ‘పెంగ్విన్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విదులైంది. ఇక ఈరోజు కీర్తి న‌రేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్ ఇండియా’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది.బిజినెస్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.

మరి కింద ఇచ్చిన వాటిలో కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.

[totalpoll id=”51443″]

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.