గోదావరి యాస నేర్చుకుంటున్న సుధీర్ బాబు

Sudheer Babu Gets Busy Learning Godavari Telugu Accent

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయగా… ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. సుధీర్ బాబు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ బాబు ఏదైనా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు గోదావరి కుర్రాడు గా కనిపించబోతున్నాడు. ఈ కారణంగా సుధీర్ బాబు గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ పాత్రకు మరింత న్యాచురాలిటీ రావడం కోసం ఆ ప్రాంత భాషను నేర్చుకుంటున్నాడట. చూద్దాం మరి సుధీర్ బాబు ఈ పాత్రలో ఎలా నటిస్తాడో

కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం 4గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.