బిగ్ బాస్ 4- బిగ్ బాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే రోజు ఏదైనా ఉంది అంటే అది సోమవారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నామినేషన్ డే కాబట్టి. ఇక నోయల్ ఎఫెక్ట్ వల్ల ఈ వారం నామినేషన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా మారాయి. మరి ఇంకెందుకు లేట్ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు చూద్దాం ఒకసారి. ఎపిసోడ్ స్టార్టింగే మోనాల్ అఖిల్ ను ఎందుకు అలా ఉన్నవని అడగడంతో బానే ఉన్నానని చెపుతాడు. రెండు మూడు సార్లు అడిగినా అదే చెప్పడంతో మోనాల్ కూడా సైలెంట్ అయిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఉదయం లేవగానే ఎవరి పనుల్లో వారు ఉండగా మెహబూబ్ పడుకోవడంతో కుక్కలు అరుస్తాయి. దీనితో ఇంటి కెప్టెన్ అయిన అరియానా పనిష్మెంట్ ఇవ్వడంతో బకెట్ నీళ్లు పోసుకున్నాడు. ఆ తర్వాత సోహైల్ పడుకుంటాడు. సోహైల్ ను కూడా అలానే చేయమని.. మెహబూబ్ కు చెప్పి నీకు చెప్పకపోతే బాగుండదని చెపుతుంది. దానికి సోహైల్ నేను ఇప్పుడే స్నానం చేశా సాయంత్రం చేస్తా అని చెప్పడంతో అది నాకు సంబంధం లేదు.. ముందు చేయమని చెప్పడంతో ఆవేశంతో పూల్ లో దూకి మెహబూబ్ బయటకు రమ్మని చెప్పినా కూడా అందులోనే చాలా సేపు వున్నాడు. అలానే లోపలి వెళ్లి నేను ఇలానే ఉంటా సాయంత్రం వరకూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అవినాష్, అమ్మ రాజశేఖర్, అఖిల్, మెహబూబ్ ఎంత చెప్పినా వినకుండా అలానే వున్నాడు. అరియనా మాత్రం సైలెంట్ గా ఎలాంటి వాదనకు దిగకుండా తన పనిలో తను ఉంది. ఇకఏలాగైనా అరియానాతో పోట్లాట పెట్టుకోవాలని డిసైడ్ అయిన సోహైల్ తన షూ లేస్ ఎక్కడ పడేసావని షూ పట్టుకొని మరీ అరియానా దగ్గరకు వెళ్లి గొడవకు దిగాడు.దానికి అరియనా నేను నీకు అప్పుడే ఇచ్చేసా.. పెట్టా అని చెప్పింది. దానికి లేవు దీనికి పనిష్మెంట్ ఏంటి అని అడుగగా.. చెప్పు పనిష్మెంట్ ఏంటి అని అడుగుతుంది అరియానా. అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది.
ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్నవారి తలపై గుడ్డు కొట్టాలని.. ఒక్కొక్కరు ఇద్దరు తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక కెప్టెన్ అరియానాను మొదట నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయమని అడుగుతాడు బిగ్ బాస్. అరియానా మొదట హారికను నామినేట్ చేస్తుంది. దానికి డెవిల్స్-హ్యూమన్ టాస్క్ రీజన్ చెపుతుంది. ఆ తర్వాత సోహైల్ కు గుడ్డు కొట్టి నామినేట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఇద్దరికీ మళ్లీ చిన్నపాటి గొడవనే జరిగింది. నెక్స్ట్ అవినాష్ ను నామినేట్ చేయమని అడగగా .. మొదట అవినాష్ ను చేశాడు. తనకు నోయెల్ తను మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చినందుకు చేస్తున్నా అని చెప్పాడు. రెండో గుడ్డు హారికను చేసి గేమ్ లో ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపించట్లేదని చెప్పాడు. మూడో అవకాశం సోహైల్ కు ఇవ్వగా నాకు అరియానాను చేయాలనుంది.. కానీ కెప్టెన్ వల్ల చేయడానికి లేదు.. తర్వాత చూసుకుంటా అని ముందు గుడ్డును మోనాల్ పై పగలగొట్టాడు. అఖిల్ కు తనకు మధ్య గ్యాప్ రావడానికి తను చెప్పడమే కారణం అంటూ చెప్పాడు. ఆ తర్వాత అభిజిత్ ను నామినేట్ చేసాడు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ లో కొంచం హీట్ ఎక్కింది హౌస్. ఇక ఈరోజు పెద్ద రచ్చనే జరగబోయేలా ఉంది. అమ్మ-అభిజిత్ మధ్య ఫుల్ వార్.. అఖిల్ మోనాల్ ను నామినేట్ చేయడం లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ రోజు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: