మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో ‘ఫలక్ నుమా దాస్’ గా రీమేక్ చేసి మంచి సక్సెస్ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ అనే కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు కొద్దీ రోజుల ముందే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ముగించుకుంది. ఇక షూటింగ్ ను మొదలుపెట్టే లోపే లాక్ డౌన్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్… మళ్లీ షూట్ కు వచ్చినందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఇంట్లో పనిలేకుండా అలా ఊరికే కూర్చోడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో మాటల్లో చెప్పలేను…కరోనా వల్ల ఇంట్లోనే ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ కరోనా నిబంధనల ప్రకారం షూటింగ్ ను మొదలుపెట్టాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు త్వరలోనే థియేటర్ లో కలుకుందాం అని కూడా తెలిపాడు.. కాగా బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఇదిలా ఉండగా నాని తన స్వంత బ్యానర్ వాల్ పేపర్ లో కూడా విశ్వక్ తో సినిమా చేస్తున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటదికదా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారట. వీటితో పాటు సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ ‘సోను కి టిటు కి స్వీటీ’ సినిమా హక్కులను సొంతం చేసుకోగా… ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం విశ్వక్ సేన్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: