ఇన్ని రోజులుగా మలయాళంలో సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియనుమ్’ రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి చూసాం. అయితే విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. మాలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్‌కు జోడీగా నటి సాయి పల్లవి నటించనుందనే వార్త ప్రచారంలో ఉంది. మలయాళంలో గౌరీ నంద చేసిన కన్నమ్మ అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే తను నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఈ సినిమా పూర్తి కాకుండానే పవన్ దర్శకులు క్రిష్, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. మరి సినిమాలు అయితే ప్రకటించారు కానీ.. అవి షూటింగ్ అయ్యేది ఎప్పుడు..?
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నాడు. సాయి పల్లవి మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























