ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ” BB3″మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అఘోరా గా ఒక పాత్ర , మరో పవర్ ఫుల్ పాత్రలో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ “సింహా “, “లెజెండ్ ” మూవీస్ తరువాత బోయపాటి , బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది. షూటింగ్ ఒక షెడ్యూల్ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణం గా నిలిచిపోయిన “BB3″మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. #NBK 106 మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో స్నేహ , మలయాళ నటి ప్రయాగ మార్టిన్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచింది. ఒక పవర్ ఫుల్ టైటిల్ కై చిత్ర యూనిట్ పలు టైటిల్స్ పరిశీలిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























