విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నయనతార ట్విటర్ ఫ్యాన్ పేజీలో అధికారికంగా విడుదల చేశారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమనేది అర్ధమవుతోంది. తల నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా చేతిలో ఆయుధాన్ని ధరించి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లుగా నయనతార కనిపిస్తున్నారు. ఢిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న నయన్ లుక్ ఆసక్తిని పెంచుతోంది.
Thank you for launching our first look, @Nayanfandom https://t.co/9mXvoHnMy6
— Milind Rau (@Milind_Rau) October 22, 2020
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విఘ్నేశ్‌శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ ఆఫీసర్ గా నయనతార నటిస్తున్నట్టు తెలుస్తుంది.
విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం నానుమ్ రౌడీదాన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. చెవిటి యువతిగా నటించిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. దానితో ఆ సినిమా సెంటిమెంట్ తో రౌడీ పిక్చర్స్ అని పెట్టాడట. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ తెచ్చిపెడుతుందో చూద్దాం..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























