‘రాధే శ్యామ్’ – ‘విక్రమాధిత్యగా’ గా ప్రభాస్

Radhe Shyam Movie Team Releases Prabhas First Look Movie Poster A Head Of His Birthday

సోషల్ మీడియా లో ప్రభాస్ సందడి మొదలైపోయింది. పుట్టిన రోజుకు మరో రెండు రోజులు ఉండగానే అప్పుడే ప్రభాస్ కు సంబంధించిన సర్ ప్రయిజ్ లు ఇస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక ఈ రోజు రాధే శ్యామ్ నుండి సర్ ప్రయిజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని తెలుపుతూ ఆ సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ నవ్వుతూ కనపడుతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.