ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సీడీపీ రిలీజ్

Rebel Star Prabhas Fans Release CDP A Head Of His Birthday

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2″మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తో బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజీ హీరోగా మారారు. హీరో ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం. “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్న ప్రభాస్ ఆ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న మైథలాజికల్ “ఆదిపురుష్ ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 23 వ తేదీ హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 2 రోజుల ముందే అభిమానుల హంగామా మొదలయ్యింది. అభిమానులు తమ అభిమాన హీరో ప్రభాస్ సీడీపీ ని సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. అశేష అభిమానులతో ప్రభాస్ ఉన్నట్టుగా రూపొందిన ఆ సీడీపీ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. హీరో ప్రభాస్ బర్త్ డే సీడీపీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “రాధేశ్యామ్” , “ఆదిపురుష్ “మూవీస్ అప్ డేట్స్ కై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.