న్యూ క్యారెక్టర్ లో నిఖిల్

Nikhil Takes Up Another Versatile Role In His New Movie 18 Pages

“హ్యాపీ డేస్ ” మూవీ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ , “యువత “మూవీ లో విలేజ్ యువకుడు , “స్వామి రారా “మూవీ లో పిక్ పాకెటర్ , “కార్తికేయ “మూవీ లో మెడికల్ స్టూడెంట్ ; “ఎక్కడికి పోతావు చిన్నవాడా “మూవీ లో ప్రేమికుడు , “అర్జున్ సురవరం “మూవీ లో డేరింగ్ జర్నలిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న హీరో నిఖిల్ ప్రస్తుతం “18 పేజెస్ “, “కార్తికేయ 2 ” మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వినూత్న కథ తో “18 పేజెస్ ” మూవీ రూపొందుతుంది. అనుపమ కథానాయిక. ఈ మూవీ లో నిఖిల్ మెమొరీ లాస్ సమస్య తో బాధ పడే క్యారెక్టర్ లో నటిస్తున్నారనీ , ఆ పాత్ర ను ఛాలెంజ్గా తీసుకున్నారనీ సమాచారం. “18 పేజెస్ ” మూవీకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.