అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానా పెళ్లి చేసుకొని మిగిలిన హీరోలకు పెద్ద షాకే ఇచ్చాడు. ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోఫొటో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రానా సతీమణి మిహికా తో వెకేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం మిహిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోనే కారణం. వారిద్దరూ బీచ్ లో ఉన్న ఒక ఫొటో పోస్ట్ చేస్తూ రానా కోసమే అని తెలిపింది. అయితే ఎప్పటి ఫొటో.. ప్లేస్ ఎక్కడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది. మరో పక్క అభిమానులు రానా- మిహికా ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారని, ఆ సందర్భంలో దిగిన ఫోటోనే ఇది అంటూ కొందరు ఆ ఫోటోకు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఫొటో ఎప్పటిదో తెలీదు కానీ ఇద్దరూ లుక్ మాత్రం స్టన్నింగ్ గా వుంది.
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























