మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తమన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆమె ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా సోకడంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడు కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై తిరిగి వెళ్ళిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియచేస్తూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది. ఇంత త్వరగా ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదు. ఏదైతేనేం చాలా త్వరగానే రికవర్ అయ్యాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతోనే నేను త్వరగా వచ్చాను. ఇప్పుడు నేను బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది’’ అంటూ తమన్నా ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
View this post on Instagram
తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. . ఇంకా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ సినిమా రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో కూడా తమన్నా నటిస్తుంది. ఇంకా “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























