కరోనా మహమ్మారి కారణంగా 6 నెలల సుదీర్ఘ విరామం తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడుతుంది. సినీ సెలబ్రిటీస్ తమ మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం శుభసూచికమే. వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్న యంగ్ హీరో నాగశౌర్య , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో సూపర్ హిట్ “పెళ్ళి చూపులు “మూవీ ఫేమ్ రీతూ వర్మ కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా “#NS20” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో కేతిక శర్మ కథానాయిక. సిక్స్ ప్యాక్ బాడీ తో ఉన్న హీరో నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో నాగశౌర్య స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందనుంది. ఈ మూవీ విజయదశమి కి లాంఛనంగా ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























