కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్స్ లేక బోసి పోయిన సినీ పరిశ్రమకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. రాజమౌళినే షూటింగ్ మొదలు పెట్టాడంటే దాదాపు అందరూ మొదలు పెట్టేసినట్టే. ఇప్పటికే చాలా మంది మెదలుపెట్టగా.. ఎలా లేదనుకున్నా ఈ నెలాఖరుకల్లా అందరూ మొదలు పెట్టేస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు యంగ్ హీరో నాగ శౌర్య కూడా సెట్‌లో అడుగుపెట్టాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Production No 8 shoot resumes today in Hyderabad with all the necessary safety measures taken! #StaySafe & Always #WearAMask @IamNagashaurya @riturv @LakshmiSowG @Composer_Vishal @vamsi84 pic.twitter.com/LzWGrB6UmO
— Sithara Entertainments (@SitharaEnts) October 12, 2020
ఇంకా సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితోపాటు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా లైన్లో పెట్టాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























