సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాబినేషన్ లో కొత్త సినిమా రానుంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ ను చూస్తుంటే ఇది కూడా ప్రేమ కథతో పాటు హెడ్ ఫోన్స్ హృదయం రూపంలో ఉండటంతో సంగీతానికి సంబందించిన జోనర్ లాగా కూడా అనిపిస్తుంది.
Krishna will be back with his Leela again! Our Production No.10 is titled #NarudiBrathukuNatana ft. @Siddu_buoy & @ShraddhaSrinath. Directed by @K13Vimal & Produced by @vamsi84. Shoot Starts this Diwali!😍@SaiprakashU @kaalabhairava7 @DheeMogilineni @anilandbhanu pic.twitter.com/WgYHbY3CCG
— Sithara Entertainments (@SitharaEnts) October 9, 2020
కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. దీపావళి నుండి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మరి సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























