‘క్రాక్’ ఆఖరి షెడ్యూల్ స్టార్ట్

Ravi Teja Krack Movie Team To Kickstart It's Last Schedule

ఫైనల్ గా రవితేజ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. చూద్దాం మరి థియేటర్స్ ఎలాగూ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.