దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఇన్నిరోజులకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌చరణ్‌కు జతగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎలాగూ షూటింగ్ మొదలుపెట్టినట్టు అప్ డేట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు తాజాగా అలియా కూడా దీనిపై తన ట్విట్టర్ లో స్పందించింది. ఆర్ఆర్ఆర్ యూనిట్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. అతి త్వరలో అలియా కూడా హైదరాబాద్‌కు వచ్చి క్వారంటైన్ పూర్తైన తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
So so looking forward to joining the team 💙
Await #RamarajuforBheemOnOct22! https://t.co/RUi9ZNycCq@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @RRRMovie @DVVMovies #WeRRRBack #RRRMovie— Alia Bhatt (@aliaa08) October 6, 2020
కాగా అక్టోబరు 22న రామరాజు ఫర్ భీమ్ వీడియో విడుదల కానున్నట్టు చెప్పి అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. మరి చరణ్ బర్త్ డే కి చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వీడియో కు చరణ్ వాయిస్ ఇస్తాడేమో.. చూద్దాం ఎలా వుండబోతుందో..



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























