మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటన లతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “క్రాక్ ” మూవీ తరువాత రవితేజ , సక్సెస్ ఫుల్ “రాక్షసుడు ” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా “అల్లుడు అదుర్స్ ” మూవీ రూపొందుతుంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రమేష్ వర్మ దర్శకత్వంలో హీరో రవితేజ కథానాయకుడిగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో యంగ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా ఎంపిక అయ్యారు. నిధి అగర్వాల్ ఒక తెలుగు మూవీ , భూమి (తమిళ ),జేమ్స్ (కన్నడ) మూవీస్ లో నటిస్తున్నారు. అను “అల్లుడు అదుర్స్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ యంగ్ హీరోయిన్స్ తో కలసి హీరో రవితేజ ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























