ఒరేయ్ బుజ్జిగా రివ్యూ – మంచి కామెడీ ఎంటర్టైనర్

Raj Tarun Orey Bujjiga Movie Receives Rave Reviews As A Clean Comedy Entertainer

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడు ఓటీటీ లో రిలీజ్ అయింది. మరి టీజర్ తో, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా.. ఎప్పటినుండో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కు ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా?లేదా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: రాజ్ తరుణ్,మాళవిక నాయర్, హెబా పటేల్, నరేష్, వాణీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మధు నందన్, సత్య, అన్నపూర్ణ, రాజా రవీంద్ర తదితరులు
దర్శకుడు: విజయ్ కుమార్ కొండా
బ్యానర్: శ్రీసత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కె.కె.రాధామోహన్‌

కథ: భీమవరంకి చెందిన బుజ్జిగాడు (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి ఇష్టం లేక పారిపోతారు.. అయితే ఇద్దరూ ఒకేరోజు వెళ్ళిపోవడంతో ఇద్దరూ కలిసి లేచిపోయారని ఊరంతా అనుకుంటారు. దీంతో వాళ్ళిద్దరి కుటుంబాల మధ్య వైరం మొదలవుతుంది. మరో పక్క ఇంట్లోనుండి పారిపోయిన రాజ్ తరుణ్, మాళవిక ఆ తర్వాత శ్రీను, స్వాతి పేర్లతో ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. ఆలా పరిచయం అయిన వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్యలోకి హెబా పటేల్ వస్తుంది. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఇంతకీ హెబా పటేల్ ఎవరు.. వారిద్దరి మధ్యలోకి ఎందుకు వచ్చింది.. రాజ్ తరుణ్-మాళవికల ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే..

విశ్లేషణ: నిజానికి ఈ సినిమాకు మేజర్ ఫ్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా ఒక హెల్తీ కామెడీని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడంలోనే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. బుజ్జిగాడు, కృష్ణవేణి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.. ఇక సెకండ్ హాఫ్ లో నరేష్ సప్తగిరి మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. మనం రెగ్యులర్ గా చూసే కథ అయినా కూడా దానికి కామెడీ ని జోడించి ఆసక్తికరంగా మార్చడంలో సక్సెస్ అయ్యాడు..

హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమాతోనే కామెడీ ని ఎంత ఈజ్ తో చేయగలడో చూపించాడు. ఇక ఈ సినిమాలో అంతే ఈజీగా తన నటనను.. కామెడీను చూపించాడు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. నిజానికి ఆ పాత్రలో మరో హీరోను ఉహించుకోలేము కూడా.. రాజ్ తరుణ్ కి తోడుగా సప్తగిరి, మధు నందన్, సత్య లాంటి కమెడియన్లు తోడవ్వడంతో సినిమాలో కామెడీ సీన్స్ బాగా పేలాయి. ఇక మాళవిక నాయర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబా పటేల్ ది చిన్న పాత్రే అయినా తన పాత్ర మేర తను నటించింది. ఇక చాలా కాలం తరవాత మళ్లీ తెరపై కనిపించిన వాణీ విశ్వనాథ్.. చాముండేశ్వరి అనే పాత్రలో హుందాతనాన్ని తన నటనలో చూపించారు. పోసాని కృష్ణమురళీ, మధునందన్, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, సత్యం రాజేష్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేర నటించారు.

ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. సింపుల్‌గా గ్రాండ్‌గా లోకేషన్స్ ను చాలా అందంగా చూపించాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయ్యేవాళ్ళకు ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి టైంపాస్ అవుతుంది. ఫుల్ కామెడీ చూసి నవ్వుకోవచ్చు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.