నితిన్ కొత్తసినిమా టైటిల్, ప్రీ లుక్ రిలీజ్

Title and Pre Look Poster Of Nithiin New Movie Check Is Out

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను అలాగే ఒకే సారి ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమా టైటిల్ ను ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ లో నితిన్ చేతికి సంకెళ్ల‌తో ఉండ‌గా..అత‌డి ముందు చెస్ కాయిన్స్ క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి థ్రిల్ల‌ర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‌రంగ్ దే సినిమా షూటింగ్ లో వున్నాడు. షూట్ పూర్త‌యిన వెంట‌నే చెక్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు తెలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌య్యాకే అంధాధున్ తెలుగు రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్ర‌యాణం, మ‌న‌మంతా..వంటి చిత్రాల‌తో డైరెక్ట‌ర్ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. మరి నితిన్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.