పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. “ఫైటర్ ” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” షూటింగ్ షెడ్యూల్ ముంబై లో 40 రోజులపాటు జరిగింది. మరొక షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ సమయం ముగిసి షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ముంబై షూటింగ్ రిస్క్ తో కూడుకున్నది కనుక హైదరాబాద్ లో సెట్స్ రూపొందించి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. “ఫైటర్ “మూవీ షూటింగ్ అక్టోబర్ 10వ తేదీ పునః ప్రారంభించడానికై హైదరాబాద్ లో ప్రత్యేక బాక్సింగ్ సెట్ ను రూపొందించారు. ఆ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్స్ ను తెరకెక్కించనున్నారు. ఏకధాటిగా షూటింగ్ జరిపి “ఫైటర్ ” మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































