అభిమానుల హృదయాలలో మెగా స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవి పేద సినీ కార్మికులకై కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను నెలకొల్పి తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్నారు. సైబరాబాద్ సి పి సజ్జనార్ ప్రారంభించిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమానికి చిరంజీవి చేయూత నందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి తన స్వంత నిధులతో ఐ & బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక మందికి ప్రాణదాత గా నిలిచారు. చిరంజీవి ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా బాధితులకు తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచిత ప్లాస్మా అందజేయాలని చిరంజీవి నిర్ణయించారు. తెల్ల రేషన్ కార్డులు , ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా చికిత్స పొందుతున్న పేద రోగులకు తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్లాస్మా అందజేస్తున్నామని , ఈ అవకాశాన్ని కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరారు. ఈ కష్ట కాలంలో ప్లాస్మా కై ఇబ్బందిపడే పేదలకు చిరంజీవి అండగా నిలిచారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























