ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మెగా స్టార్ చిరంజీవి మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ మేకింగ్ వీడియోను ‘మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్’ పేరుతో ఇటీవలే తన ఇన్స్టా లో విడుదల చేసి గుండు చేయించుకోలేదని చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ ఇంకా ఉంది. అయితే ‘వేదాళం’ రీమేక్ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్ కూడా వినిపించింది. ఇక లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘వేదాళం’ రీమేక్ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చిరు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తోందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.
ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో ‘వేదాళం’ రీమేక్ ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మార్చాడట మెహర్ రమేష్. మెహర్ చేసిన మార్పులు నచ్చడంతోనే చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































