“ఇష్టం “(2001 ) మూవీ తో టాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన శ్రియ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ “సంతోషం ” మూవీ తో శ్రియ గుర్తింపు పొందారు. “నువ్వే నువ్వే ” , “ఠాగూర్ “, నేనున్నాను “, “ఛత్రపతి “, “గౌతమి పుత్ర శాతకర్ణి “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ నటించిన దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రూపొందిన “గమనం ” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో నటిస్తూ 20 సంవత్సరాలుగా ప్రేక్షకులను శ్రియ తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్నారు. రెండు తమిళ , ఒక హిందీ మూవీ లో శ్రియ నటిస్తున్నారు. “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో శ్రియ అతిథి పాత్రలో నటిస్తున్నారు. హీరో నాగార్జున గురించి శ్రియ మాట్లాడుతూ .. “సంతోషం “మూవీ లో నటిస్తున్న సమయంలో తన వయసు చాలా తక్కువనీ , అప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోననీ , హీరో నాగార్జున తో నటించడం చాలా సౌకర్యంగా ఉందనీ , నాగార్జున కు జోడీ గా పలు మూవీస్ లో నటించినా మరిన్ని మూవీస్ నాగార్జున గారితో నటించాలని కోరుకుంటున్నాననీ, హీరో నాగార్జున తో నటించడానికి ఎప్పుడూ సిద్ధమేననీ శ్రియ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























