ఆమె పాత్రలో నటించడం గౌరవంగా ఉంది

Actress Tamannaah Express Her Happiness For Reprising Tabu Role In Andhadhun Telugu Remake

ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన ‘అందాదూన్’ సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో నటించనున్న లీడ్ యాక్ట్రెస్ ను రీసెంట్ గానే సెలెక్ట్ చేశారు చిత్రయూనిట్. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్, టబు పాత్రలో తమన్నా నటించనున్నారు. ఇక ఇప్పటికే వీరి గురించి మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. నభా, తమన్నా ఈ పాత్రలకు కరెక్ట్ గా సెట్ అవుతారని.. ఆ పాత్రలకు వారు న్యాయం చేస్తారని సెలెక్ట్ చేశామని చెప్పాడు. ఇక ఇప్పుడు త‌న పాత్ర‌పై త‌మ‌న్నా మాట్లాడుతూ.. ట‌బుకు నేనెప్పుడూ వీరాభిమానిని. ఆమె పోషించిన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నా…ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే అని తెలిపింది . అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి హీరో లేడు… విల‌న్ లేడు… నితిన్ తో తొలిసారిగా క‌లిసి ప‌నిచేస్తున్నా. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టివ‌ర‌కు నేను ప‌ని చేయ‌ని కొద్దిమంది న‌టుల్లో నితిన్ ఒక‌రు. ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు ఎక్స‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.

కాగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.