మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “RRR” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ఆచార్య ” మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా లాక్ డౌన్ కారణం గా ఇంటికే పరిమితం అయిన రామ్ చరణ్ సుమారు 6 నెలల తరువాత జిమ్ కు వెళ్ళిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఇప్పుడు తీక్షణ లుక్ తో ఉన్న తన బ్లాక్ &వైట్ ఫొటో ను నీలోని బెస్ట్ వెర్షన్ గానే ఎప్పుడూ ఉండాలి అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హీరోలు వరుణ్ తేజ్ , కళ్యాణ్ దేవ్ , అల్లు శిరీష్ లు రామ్ చరణ్ ఫోటో పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























