బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి ‘బ్లాక్ రోస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రౌటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.గత నెలలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంపత్ నంది తన ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
There are roses in this big bad world and then there is a BLACK ROSE.
Introducing #Bollywood diva @UrvashiRautela as #BlackRose – an Emotional Thriller.
Wait for more surprises coming your way..
Lemme know how you like it 🙂#SSS4 #BlackRoseFirstLook #Manisharma pic.twitter.com/nLs1cW0Kem
— Sampath Nandi (@IamSampathNandi) September 23, 2020
కాగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరెకెక్కించనున్నారు.
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































