ఫైనల్లీ.. ‘ఓటీటీ’ లో ఒరేయ్ బుజ్జిగా

Raj Tarun and Malvika Nair Wholesome Family Entertainer Orey Bujjiga Movie To Release On OTT

థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాలు చిన్నగా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలే ‘వి’ సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. దీనితో ఈ సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

 

కాగా మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.