అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అగ్ర హీరో స్థాయి రేంజ్ కు ఎదిగారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మధుడు అనే బిరుదుకు తగ్గట్టేఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఆ బిరుదుకు సార్ధకం చేస్తున్నారు. క్లాస్.. మాస్ సినిమాలే కాదు భక్తిరస చిత్రాలకు కూడా నాగ్ కేరాఫ్ అడ్రస్. తన ఇన్నేళ్ల సినీప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఇక ఈ రోజు నాగ్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు నాగ్ పుట్టిన రోజు సందర్భంగా వైల్డ్ డాగ్ చిత్రయూనిట్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. వైల్డ్ డాగ్ ఇన్ యాక్షన్.. డేర్ డెవిల్ ఏసీపీ విజయ్ వర్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
#WildDog in Action 😎
Wishing the Dare Devil ACP Vijay Varma aka @iamnagarjuna garu a very Happy Birthday.
– Team NIA#HBDKingNagarjuna @ahishor @deespeak @SaiyamiKher @Deonidas @MatineeEnt pic.twitter.com/SVLiv3xVUe— Matinee Entertainment (@MatineeEnt) August 29, 2020
సోలోమన్ దర్శకత్వంలో.. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.ఇక కింగ్ నాగార్జున తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























