‘V’ ట్రైలర్ – ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు

Natural Star Nani V Movie Trailer Is Out

కరోనా వల్ల థియేటర్ లో విడుదలవ్వాల్సిన సినిమాలు ఓటీటీ దారిన పడుతున్నాయి. మొదట ఓ రెండు మూడు నెలల్లో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఈ ఏడాది చివరి వరకూ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పటివరకూ హోల్డ్ లో పెట్టుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ కి వెళుతున్నాయి. అలా ఇన్ని రోజులు థియేటర్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమానే ‘వి’. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’. ఈ సినిమా నిజానికి ఈ ఏడాది ఉగాదికి రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ అవ్వలేదు. అయితే ఈ సినిమాకు మాత్రం మంచి బజ్ యే ఉంది. నాని నెగిటివ్ షేడ్ లో నటించడం.. పవర్ ఫుల్ ఆఫీసర్ గా సుధీర్ బాబు…వాటికి తోడు మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక ఇప్పుడు అమెజాన్ లో విడుదలవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను ఇంకా పెంచారు. కిల్ల‌ర్‌, సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య ఛాలెంజింగ్‌లో సాగే సినిమా కథగా తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదరగొట్టారు. ట్రైలర్ ను చూస్తుంటే సినిమా డిఫరెంట్ గా వుండబోతుందన్న విషయం మాత్రం అరమవుతుంది.

దీంతో పాటు ఏదైనా ఎంట‌ర్‌టైనింగ్‌గా చేయాల‌నేది నా పాల‌సీ..ఇది సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ వేరే ఉంది.. ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు.. ఎలా ఫినిష్ చేద్దాం.. అనే డైలాగ్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. నాని ని ఖచ్చితంగా డిఫరెంట్ గా చూడొచ్చు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకూ ఆగాల్సిందే.

కాగా నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 2 =