సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పువ్వు పుట్టగానే పరిమళించినట్టు , చిన్న వయస్సులోనే తన డ్యాన్స్ టాలెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. సితార అద్భుతంగా డ్యాన్స్ చేసిన పలు వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసిన సితార మదర్ నమ్రత ఇప్పుడు మై లిటిల్ డ్యాన్సర్ బేబి అంటూ సితార డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో లోని సితార క్యూట్
డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం డ్యాన్స్ క్లాసెస్ కు సితార అటెండ్ అవుతున్నారు కాబట్టి పర్ ఫెక్ట్ గా డ్యాన్స్ చేయగలుగుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత సితార క్లాసికల్ , వెస్ట్రన్ డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొనడం ఖాయం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. షూటింగ్స్ ప్రారంభం కాకపోవడం తో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక మహేష్ బాబు “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: