మన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఇక్కడ హిట్ సినిమాల్లో ఏదో ఒకటో రెండో సినిమాలు అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు రీమేక్ కు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మరో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదో కృష్ణుడు ప్రధాన పాత్రలో వచ్చిన ‘వినాయకుడు’ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో కృష్ణుడు, సానియా మరియు పూనమ్ కౌర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 2008 లో రిలీజ్ అయి డీసెంట్ హిట్ కొట్టింది. లావుగా ఉన్నవాళ్లు ప్రేమిస్తే ఎలా ఉంటుంది.. ప్రేమించడానికి ఎంత ఆలోచిస్తారు ఇలాంటి విషయాలన్నీ ఈ సినిమాలో చక్కగా చూపించారు. ప్రేమ, వినోదం, ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అందుకే నంది అవార్డులను సైతం దక్కించుకుంది ఈ సినిమా.
ఇక ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. హిందీలో కూడా సాయి కిరణే డైరెక్ట్ చేయాలని చూస్తున్నారట. తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రను హిందీలో లావుగా ఉన్న ఓ ప్రముఖ హాస్యనటుడు పోషించనున్నాడనీ సమాచారం. మిగతా నటీనటులు ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తారట. ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. మరి హిందీలో ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో.. అక్కడి ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: