అల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయినా పెద్దగా బ్రేక్ రాలేదు. అయితే తమిళ్ సినిమా రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేసి మొదటిసారిగా సూపర్ హిట్ అందుకున్నాడు. ‘రాక్షసుడు’ హిట్ కావడంతో తిరిగి సక్సెస్ బాట పట్టాడు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకునే పనిలో పడ్డాడు సాయి శ్రీనివాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే వెండి తెరకు పరిచయమై 6ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు సాయి. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి శ్రీనివాస్ తన ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. ‘‘సక్సెస్ నాకేమీ నేర్పలేదు. కానీ ఫెయిల్యూర్ వల్ల విషయాలను నేర్చుకునే అవకాశం దక్కిందని చెప్పగలను. స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకునే విధానంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. కెరీర్ ప్రారంభంలో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అయితే మా నాన్నగారు ఇంకా ఎక్కువ కష్టపడు. కష్టపడితే దాని వెనుకే సక్సెస్ ఉంటుందని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన దారిలో వెళ్లడం వల్లనే ‘రాక్షసుడు’ రూపంలో మంచి హిట్ సాధించాను’’ అని అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్.
ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు… దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: