“అందాల రాక్షసి “, “దూసుకెళ్తా “, భలే భలే మొగాడివోయ్ “, సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో లావణ్య త్రిపాఠి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో బాధితులకు లావణ్య తన వంతు సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ లు తప్పనిసరి కావడంతో మాస్క్ లు తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా , కొన్ని ప్రాంతాలలో మాస్క్ లను లావణ్య ఉచితంగా అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా వంటి వ్యాధుల నివారణ కై రోగ నిరోధక శక్తి పెంపొందించుకొనడానికి వ్యాయామాలు ఉపయోగపడతాయి . సినీ సెలబ్రిటీస్ ఇంటి వద్ద వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ వంటివి చేస్తూ ఫిట్ గా ఉంటున్నారు. కరోనా కారణం గా జిమ్ లు బంద్ కావడంతో లావణ్య తన ఇంటి టెర్రస్ పై చిన్న జిమ్ ఏర్పాటు చేసుకొని వర్కౌట్స్ చేస్తున్నారు . 4 నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం జిమ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ఒక అవుట్ సైడ్ జిమ్ కు వెళ్ళిన లావణ్య తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. లావణ్య ప్రస్తుతం “A1 ఎక్స్ ప్రెస్ “, “చావు కబురు చల్లగా “మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: