“ఫగ్లీ ” మూవీ తో బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ ప్రారంభించారు. కియారా హీరోయిన్ గా నటించిన “MS ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం , అభినయం తో కియారా అద్వానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” తో కియారా స్టార్ హీరోయిన్ గా మారారు. “కబీర్ సింగ్ ” మూవీ రికార్డ్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా నటించిన “గుడ్ న్యూస్ ” మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న కియారా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. కియారా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “షేర్ షా ” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. “భూల్ భులైయా 2” మూవీ చిత్రీకరణ లో ఉంది. టాలీవుడ్ నుండి పలు ఆఫర్స్ ఉన్నా కియారా ఏ మూవీ ఫైనలైజ్ చేయలేదు. కియారా ఒరిజినల్ నేమ్ అలియా అద్వానీ, అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సలహాతో అలియా అద్వానీ తన పేరును కియారా అద్వానీ గా మార్చుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: